కొవిడ్‌ ఆసుపత్రులపై పర్యవేక్షణ ఉంచాలి

ABN , First Publish Date - 2021-05-05T05:53:23+05:30 IST

రామచంద్రపురం ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన సింధు సుబ్రహ్మణ్యం మంగళవారం తొలి సమీక్ష నిర్వహించారు.

కొవిడ్‌ ఆసుపత్రులపై పర్యవేక్షణ ఉంచాలి

రామచంద్రపురం, మే 4: రామచంద్రపురం ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన సింధు సుబ్రహ్మణ్యం మంగళవారం తొలి సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ ఆసుపత్రులపై నిరంతర పర్యవేక్షణ వుంచాలని కమిషనర్లు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, వైద్యాధికారులను ఆదేశించారు. కొవిడ్‌ పరీక్షలు, కిట్లు పంపిణీ, ఆక్సిజన్‌ సరఫరా అంశాల్లో అప్రమత్తంగా వుంచా లని సూచించారు. కొవిడ్‌ బారిన పడి హోం ఐసోలేషన్‌లో వున్నవారిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కొవిడ్‌తో మృతి చెందిన వారికి శ్మశానవాటికల్లో అంత్యక్రి యలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమా వేశంలో ఆర్డీవో కార్యాల పరిపాలనాధికారి వేదవల్లి, అడిషనల్‌ డీఎంహెచ్‌వో కె.సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-05T05:53:23+05:30 IST