యండపల్లిలో కొవిడ్‌ మృతదేహం దహనం

ABN , First Publish Date - 2021-05-05T05:47:16+05:30 IST

కొత్తపల్లి, మే 4: యండపల్లిలో కరోనాతో మృతిచెందిన వ్యక్తికి చెందిన తోటల్లో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. యండపల్లికి చెందిన విశ్రాంత ఉద్యోగి కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో యండపల్లి సమీపంలో దళితకాలనీకి ఆనుకుని ఉన్న కొబ్బరితోటలో

యండపల్లిలో కొవిడ్‌ మృతదేహం దహనం

కొత్తపల్లి, మే 4: యండపల్లిలో కరోనాతో మృతిచెందిన వ్యక్తికి చెందిన తోటల్లో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. యండపల్లికి చెందిన విశ్రాంత ఉద్యోగి కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో యండపల్లి సమీపంలో దళితకాలనీకి ఆనుకుని ఉన్న కొబ్బరితోటలో కుటుంబసభ్యుల సూచనల మేరకు ప్రైవేటు అంబులెన్స్‌ సిబ్బంది మృత దేహా న్ని దహనం చేశారు. దళితకాలనీ సమీపంలో కరోనా సోకి మరణించిన వ్యక్తికి దహన సంస్కారాలు చేయడం పట్ల దళిత నాయకులు దడాల సతీష్‌ ఆందోళన వక్తం చేశారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.


కొవిడ్‌తో మహిళ మృతి

రౌతులపూడి, మే 4: మండంలోని ఎం.కొత్తూరు గ్రామానికి చెందిన మహిళ కొవిడ్‌తో మృతిచెందింది. జ్వరం రాగా శనివారం కరోనా పరీక్ష చేయించుకుంది. సోమవారం పాజిటివ్‌ వచ్చింది. ఆక్సిజన్‌ అందకపోవడంతో సోమవారం మధ్యా హ్నం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. 

Updated Date - 2021-05-05T05:47:16+05:30 IST