గ్రామాల్లో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-08-20T07:12:26+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరుగు తున్నాయి. కోనసీమలో గత కొన్ని రోజుల నుంచి తగ్గుముఖం పట్టిన కేసులు పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యను దాటు తుండడంతో కోనసీమలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేసుల పెరుగుదల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తతో వ్యవహరించాల్సి ఉందని పేర్కొంటున్నారు.

గ్రామాల్లో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

  • అమలాపురం డివిజన్‌లో 192 కేసుల నమోదు
  • పెళ్లిళ్ల జోరుతో వ్యాపిస్తున్న కొవిడ్‌ వైరస్‌
  • ఆందోళన చెందుతున్న కోనసీమ ప్రజలు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరుగు తున్నాయి. కోనసీమలో గత కొన్ని రోజుల నుంచి తగ్గుముఖం పట్టిన కేసులు పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యను దాటు తుండడంతో కోనసీమలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేసుల పెరుగుదల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తతో వ్యవహరించాల్సి ఉందని పేర్కొంటున్నారు. కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా వివాహాది శుభకార్యాలకు భారీగా అతిథులు హాజరవుతుండడంతో కేసుల పెరుగుదలకు ఇవి పరో క్షంగా కారణమవుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలలో థర్డ్‌వేవ్‌ ప్రభావం తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టకపోతే కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవ కాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కోనసీమ వ్యాప్తంగా ఆగస్టు 15న 108 కేసులు నమోదైతే సఖినేటిపల్లి మం డలంలోనే  అత్యధికంగా 21 కేసులు రికార్డు అయ్యాయి. ఆగస్టు 16న 89 కేసులు నమోదైతే సఖినేటిపల్లి మండలంలో అత్యధి కంగా 10 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 17న కేసులు పూర్తిగా సున్నాకు చేరుకున్నాయి. 19వ తేదీన 192 కేసులు అత్యధికంగా రికార్డు అయ్యాయి. వాటిలో కొత్తపేట 28, మలికిపురం 22, సఖి నేటిపల్లి 19, ఉప్పలగుప్తం 18, మామిడికుదురు 17, అయిన విల్లి 16 కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు మిగిలిన మండలాల్లో కూడా కేసులు రెండంకెల సంఖ్యను దాటాయి. ఒక్కసారిగా ఈ పెరుగుదల కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక జిల్లావ్యాప్తంగా కేసుల విషయానికొస్తే రాష్ట్రంలోనే అత్యధి కంగా మన జిల్లాలో గురువారం 315 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 2,83,454 పాజిటివ్‌ కేసులు ఉండగా, ప్రస్తుతం 2813 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు 2.79 లక్షల మంది కొవిడ్‌ నుంచి కోలుకుని బయటపడ్డారు. 1246 మంది మృత్యువాత పడట్టు అధికారికంగా పేర్కొన్నారు. కొవిడ్‌ కారణంగా అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంనకు చెందిన రాష్ట్ర వైసీపీ కార్యదర్శి మోహన్‌ మృతి చెందడంతో బాధితుల్లో మళ్లీ ఆందోళనలు నెలకొన్నాయి. అంబులెన్సుల హడా వుడి కూడా అమలాపురం పట్టణంలో కనిపిస్తోంది. ప్రస్తుతం వివాహాది శుభ కార్యాల సీజన్‌ కావడంతో కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తికి అనుకూలంగా ఉన్న పరిస్థితు లపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. పెళ్లిళ్లకు అనుమతి లేకుండానే వందల నుంచి వేల సంఖ్యలో అతిథులను పిలిచి వేడుకలు జరపడం వల్ల వైరస్‌ ప్రబలే ప్రమాదం ఉందన్న ఆందోళన దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమై వాటి కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-08-20T07:12:26+05:30 IST