కేసులు పైపైకి

ABN , First Publish Date - 2021-05-20T05:35:11+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్కో రోజు కొంచెం తగ్గుముఖం పట్టినా ఆ తర్వాతి రోజూ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.

కేసులు పైపైకి

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 19: జిల్లాలో కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్కో రోజు కొంచెం తగ్గుముఖం పట్టినా ఆ తర్వాతి రోజూ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా అర్బన్‌ ప్రాంతాల్లో కొవిడ్‌ ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికార యంత్రాంగం పెద్ద స్థాయిలో వైద్య సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కొవిడ్‌     బాధితులకు బెడ్‌లు దొరకని పరిస్థితి కొనసాగుతోంది. జిల్లాలో గడిచిన 24 గంటల్లో 3,528 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. అత్యధికంగా కాకినాడ అర్బన్‌ మండలంలో 441 కేసులు నమోదు కాగా  ఆ తర్వాతి స్థానంలో రాజమహేంద్రవరం అర్బన్‌లో 271 కేసులు నమోదయ్యాయి. అదే మండలాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాయవరం 120, అల్లవరం 103, చింతూరు 101, అమలాపురం 96, సఖినేటిపల్లి 93, ఉప్పలగుప్తం 85, ముమ్మిడివరం 84, జగ్గంపేట 82, బిక్కవోలు 82, రంగంపేట 72, పెదపూడి 70, పి. గన్నవరం 70, రామచంద్రపురం 68, రంపచోడవరం 68, రాజవొమ్మంగి 66, కాజులూరు 64,  మలికిపురం 62, నెల్లిపాక 56, కపిలేశ్వరపురం 55, కాకినాడ రూరల్‌ 53, కె.గంగవరం 51, అడ్డతీగల 52, అయినవిల్లి 47, కాట్రేనికోన 46, ఆత్రేయపురం 45, అలమూరు 40 పాజిటివ్‌ చొప్పు.న కేసులు వెలుగు చూశాయి. మిగిలిన మండలాల్లో కేసుల సంఖ్య రెండు అంకెల్లో నమోదైంది.

Updated Date - 2021-05-20T05:35:11+05:30 IST