కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో బాధితులకు మెరుగైన సేవలందించాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-05-28T06:11:01+05:30 IST

జిల్లాలోని కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇతర వనరులను సమర్ధవంతంగా వినియోగిస్తూ బాధితులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి ఆదేశించారు.

కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో బాధితులకు   మెరుగైన సేవలందించాలి: కలెక్టర్‌

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 27: జిల్లాలోని కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇతర వనరులను సమర్ధవంతంగా వినియోగిస్తూ బాధితులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన జేసీలు జి.లక్ష్మీశ, చేకూరి కీర్తి, జి.రాజకుమారిలతో కలిసి కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో బాధితులకు అందుతున్న వైద్య, ఇతర సేవలపై వర్చువల్‌ విధానంలో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ స్థిరీకరణ కోసం అవసరమైన ఇతర ఉపకరణాలతో పాటు ఒక్కో కేంద్రంలో 50 కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచామన్నారు. ఆక్సిజన్‌ ఫ్లో మీటర్లను కూడా ఇవ్వనున్నామన్నారు. అడ్మిషన్‌ నుంచి డిశ్చార్జ్‌ వరకు ప్రతి బాధితుని సమాచారం ఆన్‌లైన్‌ చేయాలని, ఎప్పటికప్పుడు విశ్లేషిస్తామని తెలిపారు. వైద్యులు రౌండ్లకు వెళుతూ బాధితుల ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తంగా ఉం డాలని, అత్యవరమైతే 108 ద్వారా కొవిడ్‌ ఆసుపత్రులకు పంపించాలని సూచించారు. పారిశుధ్యం, వ్యర్ధాల నిర్వహణలో రాజీలేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అమలాపురం, రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్లు హిమాన్షు కౌశిక్‌, అనుపమ అంజలి, ఆర్డీవోలు, ఆర్‌ఎంవోలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-05-28T06:11:01+05:30 IST