కరోనా వ్యాక్సినేషనకు చర్యలు

ABN , First Publish Date - 2021-01-12T05:46:40+05:30 IST

ఏజెన్సీ ఏడు మండలాల్లో కరోనా వ్యాక్సిన వేసేందుకు చర్యలు ము మ్మరం చేసినట్టు ఐటీడీఏ ఏపీవో పీవీఎస్‌ నాయుడు అన్నారు.

కరోనా వ్యాక్సినేషనకు చర్యలు

రంపచోడవరం, జనవరి 11: ఏజెన్సీ ఏడు మండలాల్లో కరోనా వ్యాక్సిన వేసేందుకు చర్యలు ము మ్మరం చేసినట్టు ఐటీడీఏ ఏపీవో పీవీఎస్‌ నాయుడు అన్నారు. సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలోని పీహెచసీలలో కరోనా వ్యాక్సిన ట్రైల్‌రన జరుగుతోందన్నారు. గ్రామాల్లో ప్లాస్టిక్‌ నిర్మూలనపై అధికారులు, సిబ్బంది అవగాహన కల్పించాలని, పాఠశాలలకు కేటాయించిన దత్తత అధికారులు నివేదికలను సమర్పించాలని సూచించారు.  కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ  డీడీ రమేష్‌ నాయక్‌, జీసీసీ డీఎం జగన్నాధరెడ్డి, పీహెచవో వై.సత్యనారాయణ, ఈఈలు పి.రమాదేవి, శ్రీనివాసరావు, ఎస్‌వో వెంకటేశ్వరరావు, ఏపీడీలు చిన్నశ్రీనివాసరావు, కోటేశ్వరరావు, ఏడీఏలు శ్యామల, రత్నకుమార్‌, డీఈలు పద్మనాభం, రాజేంద్రబాబు, రామారావు, ఎంపీడీవో లక్ష్మారెడ్డి, తహశీల్దారు కె.లక్ష్మీకళ్యాణి, ఏటీడబ్ల్యువో సుజాత, సీడీపీవో జి.వరహాలు, వైద్యాధికారులు రాజ్‌కుమార్‌, కార్తిక్‌, డీఎంవో పీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-12T05:46:40+05:30 IST