కరోనా సెకండ్ వేవ్‌తో అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-03-24T05:35:59+05:30 IST
కరోనా సెకండ్ వేవ్‌తో ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని కార్పొరేషన అదనపు కమిషనర్ ఎనవీవీ సత్యనారాయణ అన్నారు.

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 23: కరోనా సెకండ్ వేవ్‌తో ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని కార్పొరేషన అదనపు కమిషనర్ ఎనవీవీ సత్యనారాయణ అన్నారు. స్థానిక లాలాచెరువు స్వర్ణాంధ్ర ఆశ్రమంలో జరిగిన కరోనా సమయంలో ఎన్జీవోల పాత్ర తదనంతర పరిణామాలపై జరిగిన చర్చ కార్య క్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కరోనా సమయంలో ఎన్జీవోలు అందించిన సేవలు ఎనలేనివన్నారు. విశేషమైన సేవలందించిన స్వర్ణాంధ్ర గుబ్బల రాంబాబు, అనూప్‌జైన, అమీర్ పాషాలను అభినందించి, వారి సేవ లను గుర్తుచేశారు. అనంతరం పలు స్వచ్ఛంధ సేవా సంస్థల నిర్వాహకులు మాట్లాడుతూ కరోనా సమయంలో తాము రాజమహేంద్రవరం కేంద్రంగా అం దించిన సేవలు ఇతర ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలిచాయని అయితే తమ సంస్థలకు తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో కరోనాలో సేవలందించిన హెల్పింగ్ హ్యాండ్స్ మధు, హర్ష, రాజాయోనా, అజ్జ రపు ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి బంటి, కోరుకొండ చిరంజీవి, తిరుమల, పాత్రికే యులు రాజగోపాల్, కృపానందం, భూషణంలను సత్కరించారు.