పునరావాస కాలనీల పరిశీలన

ABN , First Publish Date - 2021-11-23T05:36:16+05:30 IST

పోలవరం నిర్వాసిత పునరావాస కాలనీలను కేంద్ర గిరిజన వ్యవహా రాల శాఖ కార్యదర్శి అనిల్‌కుమార్‌ పరిశీలించనున్న నేపథ్యంలో సోమవారం మండల స్థాయి అధికారులు మం డలంలోని నేలదోనెలపాడు పునరావాస కాలనీని సందర్శించారు.

పునరావాస కాలనీల పరిశీలన

గంగవరం, నవంబరు 22: పోలవరం నిర్వాసిత పునరావాస కాలనీలను కేంద్ర గిరిజన వ్యవహా రాల శాఖ కార్యదర్శి అనిల్‌కుమార్‌ పరిశీలించనున్న నేపథ్యంలో సోమవారం మండల స్థాయి అధికారులు మం డలంలోని నేలదోనెలపాడు పునరావాస కాలనీని సందర్శించారు. పాఠశాల, అంగన్‌వాడీ కేం ద్రం, ఆరోగ్య ఉప కేంద్రం భవనాలను పరిశీలించారు. కాలనీ అంతా తిరిగి అక్కడ అవసరమైన సౌకర్యాలపై ఆరా తీశారు. పర్యటనలో తహశీల్దారు శ్రీమన్నారాయణ, ఎంఈవో వై.మల్లేశ్వరరావు, సీడీపీవో నీలవేణి, ఆర్‌ఐ జిలానీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-23T05:36:16+05:30 IST