పేదల ఇళ్లపై సమీక్ష
ABN , First Publish Date - 2021-12-15T06:10:24+05:30 IST
జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేలా కార్యాచరణ చేపట్టామని కలెక్టర్ సి.హరికిరణ్ చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమల్లో పురోగతిపై మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

కాకినాడ సిటీ, డిసెంబరు 14: జిల్లాలో
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేలా కార్యాచరణ
చేపట్టామని కలెక్టర్ సి.హరికిరణ్ చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్య
కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమల్లో పురోగతిపై మంగళవారం ముఖ్యమంత్రి
జగన్మోహనరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో
అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ
సమావేశానికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్లు
సుమిత్‌కుమార్, కీర్తి చేకూరి, ఎ.భార్గవ్‌తేజ, డీఆర్‌వో
సీహెచ్.సత్తిబాబు, జిల్లా స్థాయి అధికారులతో కలిసి పాల్గొన్నారు. కొవిడ్,
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు, 90 రోజుల్లో ఇంటి
పట్టా మంజూరు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన, గ్రామ, వార్డు
సచివాలయాల సేవలు, ఆర్‌బీకేల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ
ప్రాధాన్య శాశ్వత భవన నిర్మాణాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
పథకాలు, కార్యక్రమాల అమలును వేగవంతం చేసేందుకు పలు సూచనలు చేశారు.
త్వరితగతిన ఇళ్లను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ
సందర్భంగా కోరారు. సీపీవో పి.త్రినాథ్, హౌసింగ్ పీడీ బి.సుధాకర్
పట్నాయక్, సివిల్ సప్లయిస్ డీఎం ఇ.లక్ష్మీరెడ్డి, డీఎస్‌వో
పి.ప్రసాదరావు, ఎస్.మాధవరావు తదితరులు పాల్గొన్నారు.