మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ధాన్యం సేకరణ
ABN , First Publish Date - 2021-10-29T06:46:07+05:30 IST
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కనీస మద్దతు ధరకు ఽధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఆర్‌బీకేలకు, వెలుగు గ్రూపులకు పీఏసీలు, డీసీఎంఎస్‌లు, ఆర్‌ఎంజీలు, ధాన్యం సేకరణ మద్దతు ఏజన్సీలు అనుసంధానంగా పనిచేస్తాయని కలెక్టర్ సి హరికిరణ్ పేర్కొన్నారు.
- అధికారులతో సమీక్షలో కలెక్టర్ హరికిరణ్
కాకినాడ సిటీ, అక్టోబరు 28: మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఆర్‌బీకేలకు, వెలుగు గ్రూపులకు పీఏసీలు, డీసీఎంఎస్‌లు, ఆర్‌ఎంజీలు, ధాన్యం సేకరణ మద్దతు ఏజన్సీలు అనుసంధానంగా పనిచేస్తాయని కలెక్టర్ సి హరికిరణ్ పేర్కొన్నారు. జిల్లాలో ఖరీఫ్ 2021- 22కు సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరగనున్నందున ఈ ప్రక్రియ సజావుగా సాగేలా సమన్వయశాఖల సిబ్బంది సమష్టిగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కోర్టు హాల్‌లో ధాన్యం సేకరణ సన్నద్ధత కార్యకలాపాలపై కలిసి కలెక్టర్ హరికిరణ్ ఇన్‌చార్జి జేసీ కీర్తి చేకూరి, జేసీ(హెచ్)ఎ.భార్గవ తేజలతో కలిసి వ్యవసాయ, పౌర సరఫరాల కార్పొరేషన్, సహకార, మార్కెటింగ్, తూనికలు-కొలతలు, రవాణా, కార్మిక తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్‌బీకేలు-మిల్లుల మ్యాపిం గ్‌తోపాటు వేబ్రిడ్జి కేంద్రాలను కూడా ఆర్‌బీకేలతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణకు అవసరమయ్యే కార్మికుల సమీకరణకు అంతరాష్ట్ర వలస కార్మికుల కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించాలని కార్మికశాఖ సహాయ కమిషనర్‌కు సూచించారు. అదే విధంగా స్థానికంగా అందుబాటులో ఉన్న ఉపాఽధి హామీ కూలీలను క్షేత్ర సహాయకులు గుర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పంట కోతలను ఆధారంగా చేసుకుని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించి కళ్లాల వద్ద ఎంఎస్‌పీకి ధాన్యం కొను గోలు చేయడంలో ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారీతనానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ, సివిల్ సప్లయిస్ విభాగాలు కీలకంగా వ్యవహరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ ఇ.లక్ష్మీరెడ్డి, అగ్రికల్చర్ జేడీ ఎన్.విజయ్‌కుమార్, డీఎస్‌వో పి.ప్రసాదరావు, లీగల్ మెట్రాలజీ డీసీ ఎంఎన్‌ఎస్.మాధవి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి, మార్కెటింగ్ పీడీ కె.సూర్యప్రకాశ్‌రెడ్డి, కార్మిక శాఖ ఏసీ బుల్లిరాణి తదితరులు పాల్గొన్నారు.