మూడో ఆప్షన్ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులను గ్రూపుగా తయారు చేయాలి
ABN , First Publish Date - 2021-08-25T06:53:45+05:30 IST
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పఽథకంలో మూడో ఆప్షన్‌కు సంబంధించి లబ్ధిదారులను గ్రూపుగా తయారు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు.

జిల్లా స్థాయి అధికారులతో సమీక్షలో కలెక్టర్ హరికిరణ్
కాకినాడ సిటీ, ఆగస్టు 24: నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పఽథకంలో మూడో ఆప్షన్‌కు సంబంధించి లబ్ధిదారులను గ్రూపుగా తయారు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్లు జి.లక్ష్మీశ, చేకూరి కీర్తి, ఎ.భార్గవ్ తేజలతో కలిసి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూ రికార్డుల స్వచ్ఛీకరణ, రీసర్వేలను సక్రమంగా నిర్వహించాలన్నారు. వలంటీర్ల మొబైల్ యాప్ ద్వారా జరుగుతున్న ఈ-కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ-క్రాప్ బుకింగ్‌పై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి నూరు శాతం పూర్తి చేసేలా చూడాలన్నారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, బల్క్‌మిల్క్ సెంటర్, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ శాశ్వత భవనాల నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలన్నారు. ‘స్పందన’కు వస్తున్న అర్జీలను సత్వరం పరిష్కరించడంతో పాటు ప్రతీ వారం వివిధ శాఖలకు చెందిన టెలికాన్ఫరెన్స్, సమీక్షలలో ప్రత్యేక అంశంగా పరిగణించాల న్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, జిల్లా పరిషత్ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ, డీపీవో ఎస్వీ నాగేశ్వర్‌నాయక్, మెప్మా, హౌసింగ్ పీడీలు కె.శ్రీరమణి, జీ.వీరేశ్వరప్రసాద్, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ బీఎస్ రవీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.