కొబ్బరి తోటల్లో మట్టి నమూనాల సేకరణ

ABN , First Publish Date - 2021-11-02T06:54:38+05:30 IST

చమురు, సహజవాయువుల వెలికితీతకు ఆయిల్‌ఇండియా కార్పొరేషన్‌ నిర్వహించిన కార్యకలాపాల వల్ల చనిపోతున్న కొబ్బరితోటల్లో సాంకేతిక నిపుణుల బృందం సోమవారం మట్టినమూనాలను సేకరించింది.

కొబ్బరి తోటల్లో మట్టి నమూనాల సేకరణ

ముమ్మిడివరం, నవంబరు 1: చమురు, సహజవాయువుల వెలికితీతకు ఆయిల్‌ఇండియా కార్పొరేషన్‌ నిర్వహించిన కార్యకలాపాల వల్ల చనిపోతున్న కొబ్బరితోటల్లో సాంకేతిక నిపుణుల బృందం సోమవారం మట్టినమూనాలను సేకరించింది. ముమ్మిడివరం మండలం లంకాఫ్‌ ఠాణేలంక గ్రామంలో సోమవారం అంబాజీపేట శాస్త్రవేత్త డాక్టర్‌ వి.గోవర్ధన్‌ ఆధ్వర్యంలో కొబ్బరిచెట్ల వద్ద మట్టి, నీరు, వేర్లు, ఆకులను మొత్తం 39నమూనాలు సేకరించారు. వీటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపుతున్నట్టు వారు తెలిపారు. వీరివెంట ఉద్యా నవన అధికారిణి ఎం.బబిత, ఆయిల్‌ఇండియా ప్రతినిధి ప్రవీణ్‌, గ్రామఉద్యానవన సహాయకులు అభిషేక్‌, బాబాయి, గోవిందు, సత్యప్రియ, సుమతి, రాంప్రసాద్‌, సౌమ్య, సర్పంచ్‌ కొప్పిశెట్టి కృష్ణమూర్తి, సొసైటీ అధ్యక్షులు గోదాశి నాగేశ్వరరావు, రైతులు ఉన్నారు. 


 

Updated Date - 2021-11-02T06:54:38+05:30 IST