విద్యార్థుల కుటుంబాలకు సీఎం సహాయనిధి పంపిణీ

ABN , First Publish Date - 2021-08-21T06:12:24+05:30 IST

లంకలగన్నవరం వశిష్ట గోదావరి నదీపాయలో ప్రమాదవశాత్తు గల్లంతై మృతి చెందిన నలుగురు విద్యార్థుల కుటుంబాలకు సీఎం సహాయ నిధి మంజూరైన సహాయాన్ని ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వారి తల్లిదండ్రులకు అందజేశారు.

విద్యార్థుల కుటుంబాలకు సీఎం సహాయనిధి పంపిణీ

పి.గన్నవరం, ఆగస్టు 20: లంకలగన్నవరం వశిష్ట గోదావరి నదీపాయలో ప్రమాదవశాత్తు గల్లంతై మృతి చెందిన నలుగురు విద్యార్థుల కుటుంబాలకు సీఎం సహాయ నిధి మంజూరైన సహాయాన్ని ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వారి తల్లిదండ్రులకు అందజేశారు. సర్పంచ్‌ పసలపూడి రామకృష్ణ, ఎంపీడీవో ఐఈ కుమార్‌, డిప్యూటీ తహశీల్దారు బి.గోపాలకృష్ణ, యన్నాబత్తుల ఆనంద్‌, డొక్కా ప్రభాకరమూర్తి, గనిశెట్టి గణపతి, చిట్టాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. జగనన్న పచ్చతోరణంలో భాగంగా లంకలగన్నవరంలో ఎమ్మెల్యే చిట్టిబాబు మొక్కలు నాటారు. 

 


Updated Date - 2021-08-21T06:12:24+05:30 IST