‘క్లీన్‌ గోదావరి నిరంతర ప్రక్రియ’

ABN , First Publish Date - 2021-08-22T05:28:56+05:30 IST

క్లీన్‌ గోడావరి నిరంతర కార్యక్రమం అని రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్‌ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు.

‘క్లీన్‌ గోదావరి నిరంతర ప్రక్రియ’

రాజమహేంద్రవరం సిటీ/అర్బన్‌, ఆగస్టు 21: క్లీన్‌ గోడావరి నిరంతర కార్యక్రమం అని రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి చైర్మన్‌ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శనివారం రాజమహేంద్రవరం గోదావరి తీరంలోని గౌతమిఘాట్‌ను గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరెడ్డి మాట్లాడుతూ మన కోసం గోదావరి, గోదావరి కోసం మనంలో భాగంగా ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉంటుందని తెలిపారు. గోదావరి పైన ప్రేమ, మమకారం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని, పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు 9440179277 నెంబరుకు కాల్‌ చేసి తమ వివరాలు తెలియజేయవచ్చన్నారు. ఈ సందర్భంగా యాచకులు, సాధువులకు భోజనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ పీఓ ప్రవీణ, ఎంకేఎస్‌ ప్రసాద్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు, గోదావరి పరిరక్షణ సమితి సిబ్బంది వెంకట్‌, వీరాస్వామి, నాగేంద్రబాబు, సురేష్‌, విద్యార్థినులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-22T05:28:56+05:30 IST