3,4,5 తరగతులు హైస్కూళ్లలో విలీనం
ABN , First Publish Date - 2021-12-15T05:51:40+05:30 IST
రాబోవు విద్యా సంవత్సరం నుంచి జడ్పీ ఉన్నత పాఠశాలకు దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతులను విలీనం చేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం అన్నారు.

దేవీపట్నం, డిసెంబరు 14: రాబోవు విద్యా సంవత్సరం నుంచి జడ్పీ ఉన్నత పాఠశాలకు దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతులను విలీనం చేస్తామని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం అన్నారు. మండలంలోని ఇందుకూరుపేట జడ్పీ ఉన్నత పాఠశాల, ఖచ్చులూరు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలను డీఈవో ఆదివారం సందర్శించి మాట్లాడారు. ప్రస్తుతం పాఠశాల ఆవరణలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్న యాజమాన్యం ఏప్రిల్-2022లోపు కళాశాలకు కేటాయించిన స్థలంలో కళాశాల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకుని తరలించాలని సూచించారు. కచ్చులూరు పాఠశాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులపై పాఠశాల చైర్మన్‌ను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వసతులన్నింటినీ లిఖితపూర్వకంగా తమ కు అందిస్తామని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, చైర్మన్‌కు తెలియజేశామ న్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పి.సత్య, నారాయణరెడ్డి, ఉపాధ్యాయులు ఆనందజ్యోతి, సీఆర్‌పి శ్రీనివాస్‌దొర పాల్గొన్నారు.