గోదారోళ్ల అనుబంధాలే.. 30 రోజుల్లో ప్రేమకథ
ABN , First Publish Date - 2021-02-01T06:28:53+05:30 IST
గోదారోళ్ల వెటకారం, ఆప్యాయతలను కలిపి తీసిన సినిమానే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని దర్శకుడు మున్నా అన్నారు.

భానుగుడి(కాకినాడ) జనవరి, 31: గోదారోళ్ల వెటకారం, ఆప్యాయతలను కలిపి తీసిన సినిమానే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని దర్శకుడు మున్నా అన్నారు. విజయయాత్రలో భాగంగా చిత్ర బృందం కాకినాడ పద్మప్రియ కాంప్లెక్స్‌లో ప్రేక్ష కులను కలుసుకుంది. హీరో ప్రదీప్‌మాచిరాజు ప్రేక్షకులకు ఽధన్యవాదాలు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కఽథ విన్నప్పటి నుంచి సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నానని, కానీ మధ్యలో కరోనా కారణంగా సినిమా విడుదల ఆలస్యమైందన్నారు. ఇంతటి విజయాన్ని అందించినందుకు ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. గోదావరి కుర్రాడిలా ప్రతి ఽథియేటర్‌కు వెళ్తానని, చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టిపెరిగానని చెప్పారు. సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్ మాట్లాడుతూ గోదారోళ్ల అభిమానం మరువలేనిదన్నారు. గీతాఆర్ట్స్ ఏజెంట్ చిన్నా, ఽథియేటర్ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.