ఛాయాగ్రహకుడిగా అనపర్తి కుర్రాడు
ABN , First Publish Date - 2021-04-23T05:51:54+05:30 IST
వెండితెరపై తన పేరు చూసుకోవాలన్న తపనతో అనుకున్నది సాధించారు అనపర్తికి చెందిన బొమ్మిశెట్టి జగదీష్. అసిస్టెంట్ కెమెరామెన్‌గా అనుభవం సంపాదించి పూర్తిస్థాయిలో సినిమాటోగ్రాఫర్‌గా మారారు.
‘శుక్ర’ సినిమాతో వెండితెరకు పరిచయం
అనపర్తి,
ఏప్రిల్ 22: వెండితెరపై తన పేరు చూసుకోవాలన్న తపనతో అనుకున్నది సాధించారు
అనపర్తికి చెందిన బొమ్మిశెట్టి జగదీష్. అసిస్టెంట్ కెమెరామెన్‌గా అనుభవం
సంపాదించి పూర్తిస్థాయిలో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. ఆయన ఛాయాగ్రహకుడిగా
పనిచేసిన చిత్రం ‘శుక్ర’ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా జగదీష్ తన
అనుభవాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. ‘‘పదో తరగతి వరకు అనపర్తిలోనే
విద్యాభ్యాసం సాగింది. ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్నాక కోయంబత్తూరులోని
కారుణ్య ఇన్స్టిట్యూట్లో సినిమాటోగ్రఫీలో పట్టా సాధించి పలువురు వద్ద
అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా చేశాను. సుకు పూర్వజ్ దర్శకత్వంలో ‘శుక్ర’
సినిమాకు సినిమాటోగ్రఫీ చేశాను. నా కల నిజం కావడం ఎంతో ఆనందంగా ఉంది.
త్వరలోనే అనపర్తి, పరిసర ప్రాంతాల్లో పల్లెటూరు వాతావరణంలో చిత్రాన్ని
నిర్మించాలని సంకల్పించాము. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం’ అని జగదీష్
చెప్పారు.