చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు

ABN , First Publish Date - 2021-12-19T06:39:42+05:30 IST

ముగ్గురు చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు

మండపేట, డిసెంబరు 18: ముగ్గురు చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ద్వారపూడి పంచాయతీ పరిధి వేములపల్లి బాబుజగ్జీవన్‌రామ్‌ కాలనీలో ఎనిమిదేళ్ల లోపు ఉన్న ముగ్గురు చిన్నారులపై అదే ప్రాంతానికి చెందిన అడ్డాల కిషోర్‌ అసభ్యంగా ప్రవర్తిం చాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్‌ఐ బళ్ల శివకృష్ణ అక్కడకు వెళ్లి విచారణ చేశారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.Updated Date - 2021-12-19T06:39:42+05:30 IST