ప్రైవేటు అంబులెన్సల చార్జీలివే!
ABN , First Publish Date - 2021-05-21T06:08:45+05:30 IST
జిల్లాలో ప్రైవేటు అంబులెన్స్‌ల చార్జీలను ఖరారు చేస్తూ కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అంబులెన్స్ రకం, ప్రయాణ దూరం, డ్రైవర్ బేటా, ఇంధనం ఖర్చుతో కలుపుకొని చార్జీలను నిర్ణయించారు. అయితే ఈ రేట్లలో వెంటిలేటర్, టెక్నీషియన్ చార్జీలు, ఆక్సిజన చార్జీలను కలపలేదు.

- ఖరారు చేస్తూ కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఉత్తర్వులు
- నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాల సీజ్
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), మే 20: జిల్లాలో ప్రైవేటు అంబులెన్స్‌ల చార్జీలను ఖరారు చేస్తూ కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అంబులెన్స్ రకం, ప్రయాణ దూరం, డ్రైవర్ బేటా, ఇంధనం ఖర్చుతో కలుపుకొని చార్జీలను నిర్ణయించారు. అయితే ఈ రేట్లలో వెంటిలేటర్, టెక్నీషియన్ చార్జీలు, ఆక్సిజన చార్జీలను కలపలేదు. అలాగే రెండు గంటలలోపు నిరీక్షణకు ఎలాంటి రుసుం చెల్లించనవరం లేదు. రెండు గంటలు దాటితే ప్రతీ గంటకు రూ.500 వెయిటింగ్ చార్జీగా నిర్ణయించారు. మారుతి ఓమ్ని టెంపో వాహనం 20 కిలోమీటర్ల వరకు రూ.2,600-రూ.3,200, 21 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వరకు రూ.3,200-రూ.3,700, 41 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వరకు రూ.3,700-రూ.4,200, 61 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వరకు రూ.4,700, 81 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకు రూ.4,700-రూ.5,200, 101 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు రూ.5,200- రూ.5,700 వసూలు చేయాలి. 150 కిలోమీటర్లు పైబడిన ప్రయాణానికి ఓమ్నీ టైప్ వాహనానికి కిలో మీటరుకు రూ.20, టెంపో టైప్ వాహనానికి కిలో మీటరుకు రూ.22 అదనంగా చెల్లించాలి. 150 కిలోమీటర్లు పైబడిన ప్రయాణానికి సంబంఽధించి మొత్తం ప్రయాణానికి అదనపు డ్రైవర్ బేటా రూ.500 చెల్లించాలి.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహనాల చట్టం-1988లో సెక్షన 21, సెక్షన్ 53, ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897లోని సెక్షన్ 3, విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 57 ప్రకారం కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తామని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌ను ఆదేశించారు. అంబులెన్స్ చార్జీల వివరాలను ప్రతీ కొవిడ్ ఆసుపత్రి వద్ద ప్రదర్శించేలా డీఎంహెచ్‌వో, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త చర్యలు తీసుకోవాలన్నారు.