టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

ABN , First Publish Date - 2021-10-08T05:29:03+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు.

టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు
టీడీపీలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబు

చంద్రబాబు సమక్షంలో చేరిక
 కాజులూరు/రామచంద్రపురం/ద్రాక్షారామ, అక్టోబర్‌ 7: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కాజులూరు మండలానికి చెందిన సుమారు 100 మంది మంగళగిరి బయలుదేరివెళ్ళారు.  టీడీపీ కార్యాలయంలో నారా చంద్రబాబు ఆధ్వర్యంలో వారు టీడీపీలో చేరారు. చంద్రబాబు వారికి కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తున్న రెడ్డి సుబ్రహ్మణ్యంను అభినందించారు. చురుగ్గా పనిచేసి రానున్న రోజుల్లో టీడీపీ విజయంలో అందరూ భాగస్వాములు కావాలని, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నాయకులు రాయుడు లీలాశంకర్‌, కోట తాతబ్బాయి, కురుపూడి కొండ, పెంకే సూర్యనారాయణ, మాజీ సర్పంచ్‌లు పంపన శ్రీనివాస్‌, పాలిక రాంబాబు, నాయకులు పితాని సూరసేనుడు, మాసాబత్తుల సత్యవతి తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటరీ టీడీపీ ఇన్‌చార్జ్‌ హరీష్‌ మాధుర్‌, అమలాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-08T05:29:03+05:30 IST