పునరావాస కేంద్రాలకు తరలి రావాలి
ABN , First Publish Date - 2021-07-24T05:52:24+05:30 IST
దేవీపట్నం మండలంలో గోదావరి ఉధృతి పెరగనున్న దృష్ట్యా పరివాహక ప్రాంతాల ప్రజలు పునరావాస కేం ద్రాలకు తరలి రావాలని సబ్ కలెక్టరు కట్టా సింహాచలం పిలుపునిచ్చారు.

రంపచోడవరం/దేవీపట్నం, జూలై 23: దేవీపట్నం మండలంలో గోదావరి ఉధృతి పెరగనున్న దృష్ట్యా పరివాహక ప్రాంతాల ప్రజలు పునరావాస కేం ద్రాలకు తరలి రావాలని సబ్ కలెక్టరు కట్టా సింహాచలం పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన తన ఛాంబరులో విలేకరులతో మాట్లాడారు. పోలవరం ముంపు బాధితులు ఆర్‌అండ్‌ఆర్ కాలనీలకు తరలి వెళ్లాలన్నారు. కొండమొ దలు పంచాయతీ గ్రామాలకు కాకవాడ గిరిజన సంక్షేమ హాస్టల్, రమణయ్య పేట, దేవీపట్నం గ్రామాలకు ముసురుమిల్లి గిరిజన సంక్షేమశాఖ వసతి గృహం, పూడిపల్లి, పోశమ్మగండి గ్రామాలకు పోతవరం గిరిజన ఆశ్రమ పాఠ శాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరద సహాయక చర్యలపై ఐటీ డీఏ, సబ్ కలెక్టరు కార్యాలయాల్లో .08864-243561తో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశారు.