బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దింపే వరకు పోరాటం

ABN , First Publish Date - 2021-12-20T05:14:53+05:30 IST

బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దింపేవరకు కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని పార్టీ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్‌రావు అన్నారు.

బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దింపే వరకు పోరాటం

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 19: బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దింపేవరకు కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని పార్టీ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్‌రావు అన్నారు. ఆదివారం స్థానిక దానవాయిపేటలో కాంగ్రెస్‌ నాయకురాలు చామర్తి లీలావతి ఆధ్వర్యంలో జరిగిన జన జాగరణ యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించే వరకు పోరాటం సాగిస్తామన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ప్రైవేటీకరణ చేయడం దారుమన్నారు. పీసీసీ కార్యదర్శి ముళ్ళ మాధవ్‌ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలను బతకనివ్వడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో కిషోర్‌కుమార్‌ జైన్‌, చింతాడ వెంకటేశ్వరరావు, ప్రచార కమిటీ చైర్మన్‌ బాలాజీశర్మ, ఇజ్జరౌతు విజయలక్ష్మి, బత్తిన చంద్రరావు, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ఉపాధ్యక్షుడు గట్టి నవతారకేష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు నరాల నందు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-20T05:14:53+05:30 IST