న్యూఇయర్‌ వేడుకలపై ఆంక్షలు

ABN , First Publish Date - 2021-12-31T06:08:39+05:30 IST

రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పరిధిలో న్యూఇయర్‌ వేడుకలకు ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఎస్పీ ఐశ్వర్య రస్తోగి గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

న్యూఇయర్‌ వేడుకలపై ఆంక్షలు

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 30: రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పరిధిలో న్యూఇయర్‌ వేడుకలకు ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఎస్పీ ఐశ్వర్య రస్తోగి గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నందున ఈనెల 31 రాత్రి ప్రతిఒక్కరు కచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. రాత్రి 8గంటల నుంచి అర్బన్‌ పరిధిలో ఎక్కడా నూతన సంవత్సర వేడుకలు జరపడానికి అనుమతులు లేవన్నారు. వ్యాపార సంస్థలుగాని, ముఖ్యమైన కూడళ్లలోగాని గుంపులుగుంపులుగా తిరగడం, మద్యం తాగడం, బైక్‌లపై హల్‌చల్‌ చేయ డం, వాహనాలపై తిరుగుతూ ఇతరులను ఇబ్బంది పెట్టడం, రోడ్లపై కేక్‌లు కట్‌ చేయడం, బాణాసంచా కాల్చడం చేయరాదని తెలిపారు. రాత్రి అన్ని ముఖ్యమైన కూడళ్లలో భారీ స్థాయిలో పోలీసు పికెట్‌లు, ప్రత్యేక మొబైల్‌ పెట్రోలింగ్‌లు, వాహన తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. ఎవరు నిబంధ నలు అతిక్రమించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరు కరోనా నిబంధనలు పాటిస్తూ ఎవరింట్లో వారు న్యూఇయర్‌ వేడుకలు జరపుకోవాలని ఎస్పీ సూచించారు.

Updated Date - 2021-12-31T06:08:39+05:30 IST