సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలంబాట

ABN , First Publish Date - 2021-10-14T06:29:46+05:30 IST

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలం బాట పట్టారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఆయన 12 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేపట్టిన విషయం తెలిసిందే.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలంబాట

ప్రత్తిపాడు, అక్టోబరు 13: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ  పొలం బాట పట్టారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఆయన   12 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రెండు నెలల్లో పొలం సాగు ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు బుధవారం ఆయన తన కౌలు పొలంలోకి  వచ్చి పరిశీలించారు. బ్లాక్‌ రైస్‌తో పాటు వివిధ రకాల వరిని ఆయన 12 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం చేను చిరుపొట్ట దశకు చేరుకుంది. ఈ పొలంలో కలుపు మొక్కలు, చీడపీడలు ఏమైనా ఆశించాయా అనే దానిపై ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పంట ఏపుగా పెరగి దిగుబడికి వచ్చే ఈనక దశకు చేరుకోవడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు స్థానికులు కలిశారు.

Updated Date - 2021-10-14T06:29:46+05:30 IST