ముగిసిన ‘ఉత్తర’ మహాసభలు
ABN , First Publish Date - 2021-02-01T06:08:31+05:30 IST
కార్పొరేషన్ (కాకినాడ), జనవరి 31: నగరంలోని సీబీసీఎన్‌సీ ప్రధాన కేంద్రం ఆవరణలో 3 రోజులుగా నిర్వహిస్తున్న సీబీసీఎన్‌సీ ఉత్తర సర్కార్ జిల్లాల

కార్పొరేషన్ (కాకినాడ), జనవరి 31: నగరంలోని సీబీసీఎన్‌సీ ప్రధాన కేంద్రం ఆవరణలో 3 రోజులుగా నిర్వహిస్తున్న సీబీసీఎన్‌సీ ఉత్తర సర్కార్ జిల్లాల 73వ మహాసభలు ఆదివారం ముగిశాయి. సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ ముత్తాబత్తుల రత్నకుమార్ అధ్యక్షతన ఈ మహాసభలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు,పశ్చిమ, కృష్ణ, గుం టూరు జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉత్తర సర్కారు జిల్లాల ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గోదావరి జిల్లాల అసోసియేషన్ కన్వీనర్‌గా దడాల రమేష్, కృష్ణ అసోసియేషన్ కన్వీనర్‌గా సుంకర ఆనందబాబు, నార్త్‌రన్ అసోసియేషన్ కన్వీనర్‌గా యజ్జల రాజు ఎంపికయ్యారు.