రూ.55 వేల తెలంగాణ మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-10-25T05:49:10+05:30 IST
ఎటపాక మండలం పురుషోత్తపట్నం ఇసుక చెక్ పోస్టువద్ద ఆదివారం పోలీసులు రూ.55,900 విలువైన తెలంగాణ మద్యాన్ని పట్టుకున్నారు.

- ఇద్దరి అరెస్టు.. 260 మద్యం బాటిళ్ల స్వాధీనం
ఎటపాక, అక్టోబరు 24: ఎటపాక మండలం పురుషోత్తపట్నం ఇసుక చెక్ పోస్టువద్ద ఆదివారం పోలీసులు రూ.55,900 విలువైన తెలంగాణ మద్యాన్ని పట్టుకున్నారు. చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో భద్రాచలం వైపునుంచి ఏపీలోని ఎటపాక మండలంవైపు వస్తున్న టాటామ్యాజిక్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఆ వాహనంలో ఐదు రకాల కంపెనీలకు చెందిన 260 మద్యం బాటిళ్ల స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న చింతూరు మండలం, చిడుమూరు గ్రామానికి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాహనాన్ని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.