భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2021-12-15T05:50:13+05:30 IST
ఏజెన్సీలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య అధికారులను ఆదేశించారు.

రంపచోడవరం, డిసెంబరు 14: ఏజెన్సీలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆయన గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్, విద్యాశాఖల అధికారులతో చేప ట్టిన పనులపై సమీక్షను నిర్వహించి అసహనం వ్యక్తంచేశారు. నాడు-నేడు ద్వారా ఇంకా చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాల న్నారు. ఏజెన్సీ మండలాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాల పనులకు నోడల్ అధికారిని నియమించినట్టు తెలిపారు. మండల విద్యాశాఖా ధికారులు, ఏటీడబ్ల్యువోలు మధ్యాహ్న భోజన పథకంపై పాఠశాలలు సంద ర్శించి యాప్‌లో పొందుపరచాలన్నారు. కార్యక్రమంలో డీడీ ఎం.ముక్కంటి, డీఈవో రమణ, ఏఎంవో దేవప్రసాద్, పీఎంవో ప్రసాద్, ప్రోగ్రాం మోనిట రింగ్ అధికారి రామ్‌గోపాల్, డీఈలు వేణుగోపాల్, గౌతమి, దుర్గాప్రసాద్, ఎంఈవోలు గౌరమ్మ, తాతబ్బాయి, మల్లేశ్వరరావు, ఆర్.స్వామి, విద్యాశాఖాధి కారి డీఎస్ కుమార్, ఏటీడబ్ల్యువోలు నాగజ్యోతి, విజయశాంతి, ఏఈలు భాను, వెంకటరమణ, అబ్బాయిదొర, మహేష్ పాల్గొన్నారు.