భవన నిర్మాణాలకు లక్ష్యాల నిర్ధేశం

ABN , First Publish Date - 2021-06-22T05:44:03+05:30 IST

మన్యంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలను సత్వరం పూర్తి చేయాలన్న లక్ష్యాలను నిర్దేశిస్తూ రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్‌ ఆదిత్య సోమవారం ఆదేశాలిచ్చారు.

భవన నిర్మాణాలకు లక్ష్యాల నిర్ధేశం

రంపచోడవరం, జూన్‌ 21: మన్యంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలను సత్వరం పూర్తి చేయాలన్న లక్ష్యాలను నిర్దేశిస్తూ రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్‌ ఆదిత్య సోమవారం ఆదేశాలిచ్చారు. తన కార్యాలయంలో ఈ మేరకు సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులతో ఆయన ఆయా పనులపై సమీక్ష నిర్వహించారు. ఆయా భవనాలను జూలై 10 నాటికి పూర్తి చేసి ఆయా గ్రామ పంచాయతీలకు అప్పగించాలని లక్ష్యాలను నిర్దేశించారు. ఏఏ మండలంలో ఎప్పటికి పనులు పూర్తి చేయాలో తెలిపారు. ఈ పనుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని, ఈ అంశాలన్నీ ప్రభుత్వ ప్రాధాన్యాంశాలుగా ఉన్నాయని, ఆయా పథకాలకు అవసరమైన భవనాలు పూర్తయితే సేవలు మరింత ప్రయోజనకరంగా అందుతాయని అభిప్రాయపడ్డారు. ఆయా శాఖల ఇంజనీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:44:03+05:30 IST