బౌద్ధ క్షేత్రాల పరిరక్షణకు సంకల్పించాం!

ABN , First Publish Date - 2021-12-19T07:05:08+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పురాతన బౌద్ధ క్షేత్రాలను పరిరక్షించుకోవాలని సంకల్పించామని ఉభయ తెలుగురాష్ట్రాలు, ఒడిసా, మయన్మార్‌కు చెందిన బౌద్ధ భిక్షువులు తెలిపారు.

బౌద్ధ క్షేత్రాల పరిరక్షణకు సంకల్పించాం!
గొల్లప్రోలు మండలం కొడవలిలో జరిగిన భారతీయ బౌద్ధ వారసత్వ సాంస్కృతిక ఉత్సవ సభలో పాల్గొన్న భిక్షువులు..

 భారతీయ సంస్కృతికి ఇవి ప్రతీకలు 

 కొడవలిలో బౌద్ధ వారసత్వ సాంస్కృతిక ఉత్సవం 

ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఒడిసా, మయన్మార్‌ నుంచి హాజరైన బౌద్ధ భిక్షువులు

గొల్లప్రోలు రూరల్‌, డిసెంబరు 18: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పురాతన బౌద్ధ క్షేత్రాలను పరిరక్షించుకోవాలని సంకల్పించామని ఉభయ తెలుగురాష్ట్రాలు, ఒడిసా, మయన్మార్‌కు చెందిన బౌద్ధ భిక్షువులు తెలిపారు. గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలోని బౌద్ధ మహాస్తూపం వద్ద శనివారం జరిగిన భారతీయ బౌద్ధ వారసత్వ సాంస్కృతిక ఉత్సవం, పరిరక్షణ సదస్సుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు, బౌద్ధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సుకు హాజరైన వారు మాట్లాడుతూ ఉభ య తెలుగురాష్ట్రాల్లో అశోకుని కాలంలో నిర్మించిన పురాతన బౌద్ధ క్షేత్రాలు, ఆరామాలు, స్తూపాలు ఉన్నా యన్నారు. ప్రస్తుతం ఇవి నిరాదరణకు గురవుతున్నాయని, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పలుచోట్ల ఈ క్షేత్రాలు అన్యాక్రాంతమవుతున్నాయని, కొన్నిచోట్ల తవ్వుతున్నారని, ఆక్రమణకు గురవుతున్నాయని తెలిపారు. ఇంత జరుగుతున్నా ఎవరూ వీటి పై దృష్టిసారించకపోవడం బాధాకరమన్నారు. బౌద్ధ క్షేత్రాలు ఒక మతానికి చెందినవి కావని, ఇవి భారతదేశ సాంస్కృతిక ఘన          చరిత్రకు ఆనవాళ్లుగా అభివర్ణించారు. వీటిని నాశనం చేసుకుంటే మన దేశ ఔన్నత్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నట్టవుతుందన్నారు. తొట్లగుండ బౌద్ధ క్షేత్రాన్ని ఆక్రమించుకున్నారని, దీనిని ఫిల్మ్‌సిటీకి కేటాయించాలని భావిస్తే, దాని పరిరక్షణకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. బౌద్ధం ప్రభోదించే విలువల ఆధారంగానే అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కొడవలిలోని బౌద్ధస్తూపానికి గొప్ప చారిత్రక ప్రాధాన్యం ఉందని తెలిపారు. ఈ ఉత్సవంలో బౌద్ధ భిక్షువులు భంతే మెత్తానంద (ఒడిస్సా), శ్రద్ధా రఖ్ఖిత (దమ్మపద బుద్దవిహార్‌, హైదరాబాదు), పన్యార్‌జ్వాత (మయన్మార్‌), సుందర, విఛఖ్ఖణ, విచార (మయన్మార్‌), అనాలయో(ఉండ్రాజవరం) తదితరులు పాల్గొన్నారు. ఇక బౌద్ధ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బౌద్ధ సదస్సుకు కొడవలి బౌద్ధ స్తూపం పరిరక్షణ సమితి అధ్యక్షుడు పావన ప్రసాద్‌ అధ్యక్షత వహించగా నాగార్జున యూనివర్సిటీ బుద్ధిస్ట్‌ స్టడీస్‌ విభాగాధిపతి చల్లపల్లి స్వరూపరాణి, బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ భూపతి, అయితాబత్తు ల రామేశ్వరరావు, ఎస్‌ వరుణ్‌కుమార్‌, తాడి సురేష్‌, రవీంద్రు డు, సీహెచ్‌ సుబ్బారావు, కాశీ జానకిరాముడు, పిల్లి రాంబాబు, బి రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా జాతీయ రహదారి నుంచి బౌద్ధ క్షేత్రం వరకు 130 మీటర్ల పొడ వైన బౌద్ధ పంచశీల పతాకంతో ర్యాలీగా తరలివచ్చారు. విశాఖ బుద్ధ విహార్‌ ఆధ్వర్యంలో దీనిని రూపొందించారు. ప్రవేశద్వారం వద్దనున్న బుద్ధుని విగ్రహం ఎదుట భిక్షువులు బుద్ధ వందనం నిర్వహించారు. ఉపాసకుల మధ్య బౌద్ధ భిక్షువులు బుద్ద వంద నం, త్రికరణ, పంచశీల పాటించి పూజలు నిర్వహించారు.


Updated Date - 2021-12-19T07:05:08+05:30 IST