రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

ABN , First Publish Date - 2021-08-21T06:09:00+05:30 IST

సర్పవరం జంక్షన్‌, ఆగస్టు 20: రాష్ట్రానికి మహిళా హోంమంత్రి ప్రాతినిధం వహిస్తున్నప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, గుంటూరులో నడిరోడ్డుపై బీటెక్‌ విద్యార్థిని హత్య సంఘటనతో ప్రభుత్వ పనితీరు తేటతెల్లం అయిందని బీజేపీ జిల్లా కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు ఆ

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

బీజేపీ జిల్లా కార్యదర్శి రంబాల 

సర్పవరం జంక్షన్‌, ఆగస్టు 20: రాష్ట్రానికి మహిళా హోంమంత్రి ప్రాతినిధం వహిస్తున్నప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, గుంటూరులో నడిరోడ్డుపై బీటెక్‌ విద్యార్థిని హత్య సంఘటనతో ప్రభుత్వ పనితీరు తేటతెల్లం అయిందని బీజేపీ జిల్లా కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం సర్పవరంలో జిల్లా ధార్మిక విభాగం అధ్యక్షుడు కవికొండల భీమశేఖర్‌ ఆధ్వర్యంలో బీజేపీ విస్తారక్‌ యోజనలో భాగంగా పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రంబాల  మాట్లాడుతూ కేంద్రం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతూ 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపే ధ్యేయంగా కష్టపడి పని చేయాలని కోరారు. పలువురు కార్యకర్తలను బీజేపీకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కాళ్ల ధనరాజు, పార్టీ నాయకులు అనపర్తి వెంకటేష్‌, అక్షయ్‌కుమార్‌, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-21T06:09:00+05:30 IST