మోటారుసైకిల్‌ దొంగలకు రెండేళ్లు జైలు

ABN , First Publish Date - 2021-12-30T06:45:09+05:30 IST

తుని, డిసెంబరు 29: మోటారుసైకిల్‌ దొంగిలించిన ఇద్దరికి రెండేళ్లు జైలు, రూ.2వేలు జరి మానా విధించినట్టు పట్టణ సీఐ సన్యాసిరావు బుధవారం తెలిపారు. వివరాల ప్రకారం...గతేడాది 9వ నెలలో తుని రామకృష్ణాకాలనీకి చెందిన మడికి నానిబాబు తన ఇంటిముందు మోటారుసైకిల్‌

మోటారుసైకిల్‌ దొంగలకు రెండేళ్లు జైలు

తుని, డిసెంబరు 29: మోటారుసైకిల్‌ దొంగిలించిన ఇద్దరికి రెండేళ్లు జైలు, రూ.2వేలు జరి మానా విధించినట్టు పట్టణ సీఐ సన్యాసిరావు బుధవారం తెలిపారు. వివరాల ప్రకారం...గతేడాది 9వ నెలలో తుని రామకృష్ణాకాలనీకి చెందిన మడికి నానిబాబు తన ఇంటిముందు మోటారుసైకిల్‌ పార్కింగ్‌ చేశాడు. దాన్ని విశాఖ జిల్లా చింతపల్లి మండలం పెదగొండి గ్రామానికి చెందిన మర్రి రాజుబాబు, జెమిలి సురేషు దొంగిలించినట్టు గుర్తించిన పాడేరు పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. కేసు వాదోపవాదనల అనంతరం న్యాయమూర్తి ఎస్‌.వెంకటేశ్వరరెడ్డి ముద్దాయిలకు రెండేళ్లు సాధారణ జైలు విధించారు.

Updated Date - 2021-12-30T06:45:09+05:30 IST