కర్మకాండకు హాజరై ఇంటికి తిరిగి వెళ్తుండగా మృత్యువాత

ABN , First Publish Date - 2021-12-09T05:27:38+05:30 IST

మేనమామ కర్మకాండకు హాజరై ఇంటికి తిరిగి వెళ్తుండగా బైక్‌పై నుంచి కింద పడడంతో రౌతులపూడికి చెందిన కరక లీలావతి (40) మృతి చెందింది.

కర్మకాండకు హాజరై ఇంటికి తిరిగి వెళ్తుండగా మృత్యువాత

  ప్రత్తిపాడు, డిసెంబరు 8: మేనమామ కర్మకాండకు హాజరై ఇంటికి తిరిగి వెళ్తుండగా బైక్‌పై నుంచి కింద పడడంతో రౌతులపూడికి చెందిన కరక లీలావతి (40) మృతి చెందింది. ఆమె భర్త సన్యాసిరావుతో కలిసి బుధవారం ఉదయం కార్యక్రమానికి హాజరయ్యేందుకు జగ్గంపేట మండలం ఇర్రిపాక వెళ్లింది.  సాయంత్రం రౌతులపూడి వెళ్తుండగా ధర్మవరం బైపాస్‌ కూడలి వద్ద కుక్క అడ్డురావడంతో బైక్‌ పై నుంచి కిందకు పడిపోయారు. లీలావతి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-09T05:27:38+05:30 IST