రోడ్డు ప్రమాదంలో దళిత నాయకుడి మృతి

ABN , First Publish Date - 2021-02-05T05:48:51+05:30 IST

జాతీయ రహదారిపై హుకుంపేట వద్ద డీ మార్ట్‌ సమీపంలోని కూడలి దగ్గర సిమెంట్‌ లారీ బైక్‌ను ఢీకొనడంతో దళిత నాయకుడు బవిరి అంజలయ్య (68) అక్కడికక్కడే మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో దళిత నాయకుడి మృతి

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి   4:   జాతీయ రహదారిపై హుకుంపేట వద్ద డీ మార్ట్‌ సమీపంలోని కూడలి దగ్గర సిమెంట్‌  లారీ బైక్‌ను ఢీకొనడంతో దళిత నాయకుడు బవిరి అంజలయ్య (68) అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆర్‌అండ్‌బీలో ఉద్యోగం చేసిన అంజలయ్య ఉద్యోగ విరమణ అనంతరం దళిత ఉద్యమాలలో చురుగ్గా ఉంటున్నారు. ఇటీవల దివాన్‌చెరువులో సొంత ఇళ్లు నిర్మించుకుని రాజ మహేంద్రవరం నుంచి అక్కడకు వెళ్లిపోయారు. గురువారం ధవళేశ్వరంలోని బంధువుల ఇంటికి బైక్‌పై  వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  ఈ మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-02-05T05:48:51+05:30 IST