టీడీపీ రాష్ట్ర బీసీ ఫెడరేషన్‌ కార్యదర్శిగా సత్య

ABN , First Publish Date - 2021-10-29T05:23:08+05:30 IST

రాష్ట్ర బీసీ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శిగా నియోజకవర్గంలోని అయినవిల్లి మండలం సిరిపల్లికి చెందిన వాసంశెట్టి వీరవెంకటసత్యనారాయణ(సత్య)ను నియమించారు.

టీడీపీ రాష్ట్ర  బీసీ ఫెడరేషన్‌ కార్యదర్శిగా సత్య

పి.గన్నవరం, అక్టోబరు 28: రాష్ట్ర బీసీ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శిగా నియోజకవర్గంలోని అయినవిల్లి మండలం సిరిపల్లికి చెందిన వాసంశెట్టి వీరవెంకటసత్యనారాయణ(సత్య)ను నియమించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. 2009లో సత్య టీడీపీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తనపై నమ్మకం ఉంచి పదవిని ఇచ్చినందుకు చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు సత్య కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-10-29T05:23:08+05:30 IST