బీసీ గణనంటే భయమా!

ABN , First Publish Date - 2021-10-14T06:28:20+05:30 IST

బీసీ కులాల గణన చేయమని డిమాండ్‌ చేస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు వెనకాడుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ప్రశ్నించారు.

బీసీ గణనంటే భయమా!
మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు

  ప్రభుత్వాలు ఎందుకు జంకుతున్నాయి
  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు

భానుగుడి(కాకినాడ), అక్టోబరు 12: బీసీ కులాల గణన చేయమని డిమాండ్‌ చేస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు వెనకాడుతున్నాయని  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  కులాల వారీగా జనగణన చేస్తే బీసీల సంఖ్యా బలం బహిర్గతమవుతుందని చెప్పారు. కాకినాడలో జిల్లా పరిషత్‌ అతిథి గృహంలో బుధవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు కమ్మర క్రాంతికుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేశన మాట్లాడారు.  బ్రిటిష్‌ కాలంలో బీసీ కులాల జనగణన జరిగిందని అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా గణన చేపట్టలేదన్నారు.  రాష్ట్రంలో ఉన్న వలంటరీ వ్యవస్థ ఏ రాష్ట్రంలోనూ లేదని, ఒక్కరోజులోనే కులగణన చేయవచ్చని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందో చెప్పాలన్నారు. ఇప్పటికే 19 రాష్ట్రాలు కులాల గణనకు సుముఖంగా ఉన్నాయని, త్వరలోనే అందరినీ కలుపుకుని ముందుకు వెళతామన్నారు. ఈనెల 22న విజయనగరంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం, 23న శ్రీకాకుళంలో ఒక్క రోజు నిరాహాదీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. బీసీ జిల్లా ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు సంసాల శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ శాఖ జిల్లా ఉపాధ్యక్షుడు వాసంశెట్టి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-14T06:28:20+05:30 IST