బండారులంక హైస్కూల్లో నిధుల గోల్‌మాల్‌ వాస్తవమే

ABN , First Publish Date - 2021-12-28T06:36:49+05:30 IST

బండారు లంక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిధుల గోల్‌ మాల్‌ వాస్తవమేనని అధికారులు విచారణలో తేలింది. ‘గోల్‌మాల్‌’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి జిల్లా విద్యా శాఖ అధికారులు స్పందించారు.

బండారులంక హైస్కూల్లో నిధుల గోల్‌మాల్‌ వాస్తవమే

అమలాపురం రూరల్‌, డిసెంబరు 27: బండారు లంక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిధుల గోల్‌ మాల్‌ వాస్తవమేనని అధికారులు విచారణలో తేలింది. ‘గోల్‌మాల్‌’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి జిల్లా విద్యా శాఖ అధికారులు స్పందించారు.   ఎంపీడీవో ఎం.ప్రభాకరరావు, ఎంఈవో కె.కిరణ్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన విచారణలో జడ్పీటీసీ పందికి శ్రీహరి, ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి, సెంట్రల్‌ డెల్టా చైర్మన్‌ కుడుపూడి వెంకటేశ్వర, సర్పంచ్‌ పెనుమాల సునీత పాల్గొన్నారు. పనులు చేయకుండా మెటీరియల్‌ రాకుండా రూ.1.50 లక్షల చెక్కును గత పాఠశాల విద్యా కమిటీ చైర్‌పర్సన్‌ పడవల లీలాశశిధర్‌కు ఎలా ఇచ్చారని ఉప సర్పంచ్‌ కామిశెట్టి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. విచారణలో పాల్గొన్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఒకే పనికి రెండు బిల్లులు చెల్లించి ఇంతవరకు ఎందుకు వసూలు చేయలేదని హెచ్‌ఎం నిట్టల వీఎస్‌ఎస్‌ దుర్గాప్రసాద్‌ను ప్రశ్నిం చారు. నాటి విద్యా కమిటీ చైర్‌పర్సన్‌ వద్ద ఉన్న నిధు లను వెనక్కు తీసుకుని అభివృద్ధి పనులను పదిహేను రోజుల్లో పూర్తి చేస్తానని హెచ్‌ఎం ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలిపారు. గత చైర్‌పర్సన్‌ చెల్లించినా చెల్లించకపోయినా పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత మీదేనని హెచ్‌ఎంకు సూచించారు. పాఠశాల అభివృద్ధి పనుల కోసం వచ్చిన ఇసుక, కంకరతో పాటు రూ.లక్ష విలువైన సిమెంటు బస్తాలను ఏం చేశారని అధికా రులు ప్రశ్నించగా గ్రామంలో సచివాలయ నిర్మాణానికి అప్పుగా ఇచ్చాచని చెప్పారు. ఈ ఏడాది మార్చిలో ఈ తంతు జరిగినా ఇంతవరకు ఉన్నతాధికారులకు ఎందు కు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. వాటన్నింటినీ రప్పించి పనులు పూర్తిచేసే బాధ్యత తనదేనని హెచ్‌ఎం పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధి కారికి నివేదిక అందజేస్తామని ఎంఈవో కిరణ్‌బాబు తెలిపారు. విచారణలో పెనుమాల ఏడుకొండలు, జాన గణేష్‌, అంకం పెదరాజు, ఎంపీటీసీలు కామిశెట్టి కుసుమ, అంకం హిమభారతి తదితరులు పాల్గొన్నారు. విచారణ అనంతరం జడ్పీటీసీ, ఎంపీపీలు పాఠశాల తరగతి గదులను పరిశీలించగా నేలపైనే విద్యార్థులు కూర్చొని ఉండడాన్ని చూసి కనీసం బెంచీలు వేయరా అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు.

Updated Date - 2021-12-28T06:36:49+05:30 IST