రాష్ట్రస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2021-11-01T05:10:48+05:30 IST

స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొనే జూనియర్‌ బాలురు, బాలికల జట్లను ఎంపిక చేశారు.

రాష్ట్రస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు జట్ల ఎంపిక

బిక్కవోలు, అక్టోబరు 31: స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొనే జూనియర్‌ బాలురు, బాలికల జట్లను ఎంపిక చేశారు. జిల్లా నలుమూలల నుంచి 45 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. బాలుర విభాగంలో డి.షల్లీ, బి.స్వామి, సీహెచ్‌. రాజు, సీహెచ్‌. ఆనందకుమార్‌, మణికంఠరెడ్డి, ఎస్‌.శివరాకేష్‌, డి.వినయ్‌(బిక్కవోలు), బి.దుర్గాప్రసాద్‌, కె.హేమంత్‌కుమార్‌ (బలభద్రపురం), పి.నవీన్‌(అనపర్తి), స్టాండ్‌ బాయ్స్‌గా ఎస్‌కె.వల్లీ(బిక్కవోలు), ఎస్‌.సుమంత్‌(పందలపాక), పి.భాస్కర్‌(వెదురుపాక), ఎస్‌కే ఉస్మాన్‌(బలభద్రపురం) ఎంపికయ్యారు. బాలికల విభాగంలో పి.శిరీష, కె.వాణి, ఆర్‌.లావణ్యజ్యోతి, పి.పుష్పజ్యోతి, ఈ.కరుణ(బిక్కవోలు), ఐ.బిందుశ్రీ(నీలపల్లి), డి.అనూష (అనపర్తి), టి.అలేఖ్య(చెల్లూరు), బి.లక్ష్మీతులసి(వాడపాలెం), ఎల్‌.నాగశ్రీ(వెదురుపాక), స్టాండ్‌ గరల్స్‌గా బి.భావన(కొత్తపేట), కె.నవ్యశ్రీ(అనపర్తి), ఎ.వర్షిణీకావ్య(వెదురుపాక), పి.జాన్సీరాణి(చెల్లూరు) ఎంపికయ్యారు. వీరందరూ ఈనెల 13, 14, 15 తేదీల్లో నెల్లూరు జిల్లా పొదలకూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున పాల్గొంటారని జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ ప్రధాన కార్యదర్శి ముప్పన వీర్రాజు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మానుకొండ వీర్రాఘవరెడ్డి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వీకేఆర్‌. తంబి, సెలక్షన్‌ కమిటీ కన్వీనర్‌ వి. శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-11-01T05:10:48+05:30 IST