నిర్లక్ష్యానికి బలవుతున్న నిండుప్రాణాలు!

ABN , First Publish Date - 2021-11-02T05:30:00+05:30 IST

తుని, నవంబరు 2: ప్రజలకు మెరుగైన సేవలందించాల్సిన తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కొందరు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండుప్రాణాలు బలవుతున్నాయి. రోగులకు వరంగా ఉండాల్సిన ఆసుపత్రి వ్యాపార కేంద్రంగా మారిపోవడంతో సాధారణ రోగానికి కూడా అత్యవసరమంటూ ప్రైవేటు ఆసుపత్రికి లేదా కాకినాడకు పంపి చేతులు దులుపేసుకుంటున్నారు. దీని వల్ల రోగుల ప్రాణాలు మార్గమధ్యంలోనే గాలిలో కలిసిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల ఇద్దరు గర్భిణులు ఏరియాసుపత్రిలో ప్రసవానికి రాగా వైద్యసిబ్బంది నిర్లక్ష్యం

నిర్లక్ష్యానికి బలవుతున్న నిండుప్రాణాలు!
తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి

తుని ఏరియా ఆసుపత్రి సిబ్బంది తీరుతో అవస్థలు పడుతున్న ప్రజలు

సాధారణ స్థితిలోనూ  అత్యవసరమని కాకినాడకు తరలింపు

చేతులు దులుపేసుకుంటున్న వైద్యులు

నలిగిపోతున్న రోగులు

తుని, నవంబరు 2: ప్రజలకు మెరుగైన సేవలందించాల్సిన తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కొందరు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండుప్రాణాలు బలవుతున్నాయి. రోగులకు వరంగా ఉండాల్సిన ఆసుపత్రి వ్యాపార కేంద్రంగా మారిపోవడంతో సాధారణ రోగానికి కూడా అత్యవసరమంటూ ప్రైవేటు ఆసుపత్రికి లేదా కాకినాడకు పంపి చేతులు దులుపేసుకుంటున్నారు. దీని వల్ల రోగుల ప్రాణాలు మార్గమధ్యంలోనే గాలిలో కలిసిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల ఇద్దరు గర్భిణులు ఏరియాసుపత్రిలో ప్రసవానికి రాగా వైద్యసిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆ తల్లులు పిల్లలను కోల్పోయి గర్భశోకానికి గురయ్యారు. ఒకవేళ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి ఉంటే తమ బిడ్డలు దక్కేవారని, ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం వహించినవారిపై చర్యలు తీసుకోవాలని మృత శిశువుతో ధర్నా చేసిన సంఘటన తెలిసిందే. ఇదే రీతిలో ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులు ఆసుపత్రికి వస్తే వారికి స్థానికంగా వైద్యసేవలందించే అవకాశం ఉన్నప్పటికీ నామమాత్రపు చికిత్స చేసి కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువెళ్లాలని సూచిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీని వల్ల అంబులెన్స్‌ అందుకు కావలసిన ద్రవ్యం సమకూర్చుకుని కాకినాడకు తీసుకెళ్లేలోపే రోగులు మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ వైద్యం చేసే అవకాశం ఉన్న దాన్ని భారంగా భావించి, అత్యవసర కేసులంటూ వేరే ప్రాంతానికి తీసుకెళ్లామంటున్నారని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. మహిళలకు కూడా కొంతమంది సిబ్బంది ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందడం మంచిదని చెప్పడంతో సంబంధిత వైద్యుల ఆసుపత్రులకే తప్పక వెళ్తున్నారు. అలాగే స్థానికంగా అందించే వైద్యానికి కూడా రూ.3 నుంచి 5వేలు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వాసుపత్రికి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు అనేక రకాల సౌకర్యాలు కల్పించాయి. ఇక్కడకు వచ్చే రోగులకు ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే సొంత ఖర్చులతో భోజన ఏర్పా ట్లు చేస్తున్నారు. అయినా వైద్యుల, సిబ్బంది తీరులో మా ర్పులేకపోవడంతో వారి నిర్లక్ష్య ధోరణికి నిండుప్రాణాలు బలవుతున్నాయి. ఇప్పటికైనా పాలకవర్గం ఈ విషయంపై దృష్టి సారించి మెరుగైన సేవలందించే విధంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-11-02T05:30:00+05:30 IST