వైసీపీ మహిళా కార్యదర్శిపై దాడి కేసులో రౌడీషీటర్‌తో సహా పదిహేడు మంది అరెస్టు

ABN , First Publish Date - 2021-01-20T06:04:17+05:30 IST

వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి, మరో ముగ్గురిపై దాడిచేసిన కేసులో రౌడీషీటర్‌తో సహా పదిహేడు మందిని మంగళవారం అరెస్టు చేసినట్టు అమలాపురం డీఎస్పీ వై.మాధ వరెడ్డి తెలిపారు.

వైసీపీ మహిళా కార్యదర్శిపై దాడి కేసులో  రౌడీషీటర్‌తో సహా పదిహేడు మంది అరెస్టు

అమలాపురం రూరల్‌, జనవరి 19:  వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి, మరో ముగ్గురిపై దాడిచేసిన కేసులో రౌడీషీటర్‌తో సహా పదిహేడు మందిని మంగళవారం అరెస్టు చేసినట్టు అమలాపురం డీఎస్పీ వై.మాధ వరెడ్డి తెలిపారు. ఈనెల15వ తేదీ అర్ధరాత్రి రౌడీషీటర్‌ కేతా భానుతేజ తన అనుచరులతో కలిసి బండారులంకలోని దంగేటివారిపాలెంలో కండిబోయిన వెంకటేశ్వరరావు ఇంట్లోకి ప్రవేశించి నలుగురిని గాయ పర్చాడు.  ఈదాడిలో గాయపడ్డ వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కండి బోయిన భారతి, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు తాలుకా ఎస్‌ఐ సీహెచ్‌ రాజేష్‌ మంగళవారం రౌడీషీటర్‌ కేతా భానుతేజ, 17మందిని అరెస్టుచేసి అమలాపురం కోర్టులో హాజరుపర్చారు. వారికి న్యాయమూర్తి 14రోజులు రిమాండు విధించారు.  Updated Date - 2021-01-20T06:04:17+05:30 IST