‘అక్రమణదారులపై చర్యలు తప్పవు’

ABN , First Publish Date - 2021-10-15T05:04:07+05:30 IST

రమణయ్యపేటలో దేవదాయశాఖకు సంబంధించిన భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని, నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణా లు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ వేండ్ర విజయరాజు హెచ్చరించా రు.

‘అక్రమణదారులపై చర్యలు తప్పవు’

భానుగుడి  (కాకినాడ),  అక్టోబరు 14: రమణయ్యపేటలో దేవదాయశాఖకు సంబంధించిన భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని, నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణా లు చేపడితే చట్టరీత్యా చర్యలు  తీసుకుంటామని దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ వేండ్ర విజయరాజు హెచ్చరించా రు. కాకినాడ దేవదాయ, ధర్మదాయశాఖ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూకాలమ్మ తల్లి ఆలయానికి చెందిన స్థలాన్ని అన్యాక్రాంతం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఈ స్థలం దేవదాయశాఖకు చెందినదని, ఇందులో ప్రైవేట్‌ వ్యక్తులు   నిర్మాణాలు, కబ్జాకు పాల్పడితే చూస్తూ ఊరుకునేదిలేదని,  చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల సదరు స్థలంలో అక్రమంగా నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై   సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. 



Updated Date - 2021-10-15T05:04:07+05:30 IST