గౌరవసభను కౌరవసభగా మార్చిన ఘనత వైసీపీదే
ABN , First Publish Date - 2021-12-09T05:40:52+05:30 IST
గౌరవసభను కౌరవ సభగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు.

అమలాపురం రూరల్, డిసెంబరు 8: గౌరవసభను కౌరవ సభగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. మహిళల పట్ల నీచంగా మాట్లాడి గౌరవసభ పరువును తీసేశారని ఎద్దేవా చేశారు. బుధవారం మండ లంలోని ఇందుపల్లి, పట్టణ పరిధిలోని 24వవార్డులో టీడీపీ మండల, పట్టణశాఖల అధ్యక్షులు మల్లుల పోలయ్య, తిక్కి రెడ్డి నేతాజీల ఆధ్వర్యంలో గౌరవసభ కార్యక్ర మాలు నిర్వ హించగా ఆనందరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, రాష్ట్ర కార్యదర్శి పెచ్చెటి చంద్ర మౌళిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందుపల్లిలో పలు కాలనీల్లో ఇంటింటికీ తిరిగి జగన్ ప్రభుత్వ హయాంలో పతాకస్థాయికి చేరుకున్న అవినీతి, అక్రమాలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి మం ద గెద్దయ్య, భాస్కర్ల రామకృష్ణ, గోసంగి ఆనందరావు, నడిం పల్లి అర్జునవర్మ, నంధ్యాల దొరబాబు, అక్కల కుమార్, మల్లుల రామకృష్ణ, కుసుమ సూర్యమోహనరావు పాల్గొన్నారు.