ఏఎస్‌డీఎస్ సంస్థ సేవలు ప్రశంసనీయం
ABN , First Publish Date - 2021-12-30T06:30:00+05:30 IST
మండలంలోని రేఖపల్లి ఏఎస్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ సేవలు ప్రశంసనీయమని చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ పేర్కొన్నారు

ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ
వరరామచంద్రాపురం, డిసెంబరు 29: మండలంలోని రేఖపల్లి ఏఎస్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ సేవలు ప్రశంసనీయమని చింతూరు ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ పేర్కొన్నారు. సంస్థ స్థాపించి 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంస్ధ డైరెక్టర్ వి.గాంఽధీబాబును అభినందించారు. కార్యక్రమం లో గ్రామ్య సంస్ద డైరెక్టర్ రుక్మిణిరావు, మనోహర్‌ప్రసాద్, విశ్రాంత ఐఏఎస్ పీఎస్‌ఎస్ అజయ్, సంస్ధ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందనలో పాల్గొన్న పీవో దృష్టికి ప్రజాప్రతినిధులు మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వివరించారు. ఎంపీడీవో కార్యాలయంలో మంచినీటి సమస్య, రహదారులు, పాఠశాలల పనితీరుపై సమీక్షించారు. శాఖల వారీగా 74 వినతులను ప్రజల నుంచి స్వీక రించారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అదికారులకు సూచించారు. జడ్పీటీసీ వాళ్ళ రంగారెడ్డి, ఎంపీపీ కారం లక్ష్మి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, తహశీల్దారు ఎన్.శ్రీధర్, ఎంపీడీవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.