ఆదిత్యలో ప్రశాంతంగా ఏపీఈ, ఏపీ సెట్‌ 2021 పరీక్షలు

ABN , First Publish Date - 2021-08-20T06:24:58+05:30 IST

మండలంలో సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహించిన ఏపీఈ, ఏపీసెట్‌ 2021 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని క్యాంపస్‌ డైరెక్టర్‌ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఆదిత్యలో ప్రశాంతంగా   ఏపీఈ, ఏపీ సెట్‌ 2021 పరీక్షలు

గండేపల్లి, ఆగస్టు 19: మండలంలో సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహించిన ఏపీఈ, ఏపీసెట్‌ 2021 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని క్యాంపస్‌ డైరెక్టర్‌ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.  గురువారం నుంచి 25వ తేదీ బుధవారం వరకు ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు సెప్టెంబర్‌ 3, 6, 7 తేదీలలో ఫార్మసీ అగ్రికల్చర్‌ కళాశాలకు ఆన్‌లైన్‌ పరీక్షలు జరగనున్నాయని ఆయన తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు,  అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని వారన్నారు. మొదటిరోజు ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాల సెంటర్‌లో ఉదయం 235 మంది కిగాను 212 మంది, మధ్యాహ్నం 200 మందికిగాను 188 మంది హాజరయ్యారని, అలాగే ఇంజనీరింగ్‌ టెక్నాలజీ కళాశాలలో 185 మందికి 166 మంది, 183 మందికి 173 మంది విద్యార్థులు హాజరయ్యారని వారు తెలిపారు. అలాగే పాలిటెక్నిక్‌ కళాశాలలో 100 మందికి 92 మంది మధ్యాహ్నం 93మంది హజరయ్యారని వారన్నారు. ఈ పరీక్షలలో చీఫ్‌ సూపరింటెండెంట్‌గా ప్రిన్సిపాల్స్‌ ఎం. శ్రీనివాసరెడ్డి, కె.రామకృష్ణారావు, ఎస్‌. కుమార్‌, ఆదిరెడ్డి రమేష్‌, ఎం.రాజాబాబు, మాణిఖ్యాలరావు, కె.భాను, రాజేష్‌నాయుడు, శేషు కుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-08-20T06:24:58+05:30 IST