కరోనాతో అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-03-24T06:47:51+05:30 IST
రాజమహేంద్రవరం అర్బన్, మార్చి 23: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ యు.రామకృష్ణారావు అన్నారు. మంగళవారం సాయం

వైద్యవిధాన పరిషత్ కమిషనర్
ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారులు, వైద్యులతో సమీక్ష
రాజమహేంద్రవరం అర్బన్, మార్చి 23: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ యు.రామకృష్ణారావు అన్నారు. మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన ఆయన రోగులకు అందుతున్న వైద్యసేవలపై వైద్యాధికారులు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేరే కరోనా బాధితులకు అవసరమైన బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నా రు. వ్యాక్సినేషన్ ప్రక్రియ విధివిధానాలు, కరోనా టెస్టులు, కరోనా ఇన్‌పేషెంట్ల వివరాలు, ఇతర వైద్యసేవలపైనా ఆరా తీశారు. సమీక్షలో జిల్లా వైద్యసేవల సమన్వయాధికారి డాక్టర్ టి.రమేష్‌కిషోర్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.సోమసుందరరావు, ఆర్‌ఎంవో ఆనంద్ పాల్గొన్నారు. కాగా ఏడాది కాలపరిమితితో నియమితులైన పారామెడికల్ వైద్యసిబ్బంది తమను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు.