విద్యాభివృద్ధికి ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-09-04T05:26:15+05:30 IST

పెద్దాపురం, సెప్టెంబరు 3: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు అన్నారు. మండల పరిధిలోని మర్లావ గ్రామంలో శుక్ర వారం నాడు-నేడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామం లో సుమారు రూ.23 లక్షలతో నిర్మించిన

విద్యాభివృద్ధికి ప్రాధాన్యం

పెద్దాపురం, సెప్టెంబరు 3: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు అన్నారు. మండల పరిధిలోని మర్లావ గ్రామంలో శుక్ర వారం నాడు-నేడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామం లో సుమారు రూ.23 లక్షలతో నిర్మించిన పాఠశాలను ప్రారంభి ంచారు. విద్యార్థులకు విద్యాదీవెన కిట్లు అందజేశారు. అనంతరం పెద్దాపురం క్యాంపు కార్యాలయంలో పేదలందరికీ ఇళ్లు, అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్షించారు. ఎంఈవో జోసెఫ్‌, గవరసాన సూరిబాబు, నరాలశెట్టి బాబ్జీరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-04T05:26:15+05:30 IST