నాలుగో రోజు...ఏపీఈఏపీ సెట్‌కు 2,751 మంది విద్యార్థుల హాజరు
ABN , First Publish Date - 2021-08-25T06:52:14+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఏపీఈఏపీసెట్‌కు జిల్లాలోని తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో ఇంజనీరింగ్ పరీక్షలకు రెండు సెషన్లకు కలిపి మంగళవారం 2,896 మంది అభ్యర్థులకు గాను 2,751 మంది రాగా 94.99 శాతం హాజరు నమోదైనట్టు కన్వీనర్ వి.రవీంద్ర తెలిపారు.

నేటితో ముగియనున్న ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు
జేఎన్టీయూకే, ఆగస్టు 24: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఏపీఈఏపీసెట్‌కు జిల్లాలోని తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో ఇంజనీరింగ్ పరీక్షలకు రెండు సెషన్లకు కలిపి మంగళవారం 2,896 మంది అభ్యర్థులకు గాను 2,751 మంది రాగా 94.99 శాతం హాజరు నమోదైనట్టు కన్వీనర్ వి.రవీంద్ర తెలిపారు. ఈ నెల 19న ప్రారంభమైన ఇంజనీరింగ్ పరీక్షలు బుధవారం ముగియనున్నాయన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశపరీక్షలను వచ్చే నెల 3, 6, 7 తేదీల్లో కంప్యూటర్ విధానంలో నిర్వహిస్తామన్నారు. ఇంజనీరింగ్ పరీక్షల ప్రాథమిక కీని బుధవారం విడుదల చేస్తామని కన్వీనర్ చెప్పారు.