రత్నగిరిపై మద్యం తాగిన ఇద్దరి పట్టివేత

ABN , First Publish Date - 2021-03-21T05:36:43+05:30 IST

అన్నవరం, మార్చి 20: అన్నవరం కొండపై ఇద్దరు భక్తులు మద్యంతాగుతూ పట్టుబడ్డారు. కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన భక్తబృందం టూరిస్టుబస్సులో స్వా

రత్నగిరిపై మద్యం తాగిన ఇద్దరి పట్టివేత

అన్నవరం, మార్చి 20: అన్నవరం కొండపై ఇద్దరు భక్తులు మద్యంతాగుతూ పట్టుబడ్డారు. కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన భక్తబృందం టూరిస్టుబస్సులో స్వామి దర్శనానికి వచ్చారు. దర్శనానంతరం బస్సుపక్కనే ఇద్దరు మద్యం తాగుతుండగా భద్రతా సిబ్బంది చూశారు. ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపి ఇద్దరిని పోలీ్‌సస్టేషన్‌కు అప్పగించినట్టు పీఆర్వో కొండలరావు తెలిపారు.

Updated Date - 2021-03-21T05:36:43+05:30 IST