ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా అన్నా క్యాంటీన్‌

ABN , First Publish Date - 2021-08-27T06:14:59+05:30 IST

ఒక్కప్పుడు నలుగురు ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్‌ నేడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంగా రూపాంతరం చెందింది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా అన్నా క్యాంటీన్‌

కార్పొరేషన్‌(కాకినాడ), ఆగస్టు 26: ఒక్కప్పుడు నలుగురు ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్‌ నేడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంగా రూపాంతరం చెందింది. కాకినాడ సూర్యరావుపేటలో గత ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్‌గా ఏర్పాటు చేసిన ఈ భవనాన్ని ప్రస్తుతం తాత్కాలిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మార్చి వైద్యసేవలు అందిస్తున్నారు. రాజాట్యాంక్‌లో ప్రాఽథమిక  ఆరోగ్యకేంద్రం నిర్మాణ దశలో ఉండడంతో ఈ అన్నాక్యాంటీన్‌ను ప్రస్తుతం ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంగా మార్చారు.Updated Date - 2021-08-27T06:14:59+05:30 IST