ఏఎన్‌ఎంలను నియమించాలి

ABN , First Publish Date - 2021-12-25T05:45:07+05:30 IST

ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో విఽధిగా ఏఎన్‌ఎంలను నియమించాలని పీడీఎస్‌ యూ చింతూరు డివిజన్‌ కార్యదర్శి పి.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.

ఏఎన్‌ఎంలను నియమించాలి

చింతూరు, డిసెంబరు 24: ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో విఽధిగా ఏఎన్‌ఎంలను నియమించాలని పీడీఎస్‌ యూ చింతూరు డివిజన్‌ కార్యదర్శి పి.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన నేతృత్వంలో డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని చింతూరు ఐటీడీఏ ఏపీవో సూర్యనారాయణకు అందజేశారు. ఆశ్రమ పాఠశా లల్లో నెలకోసారి వైద్య శిబిరాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కళాశాల లతోపాటు పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ఈ కారణంగా నాణ్య మైన విద్య అందట్లేదన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పి.శ్రీను, కె.విక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-25T05:45:07+05:30 IST