అమీనాబాద్‌లో డెంగ్యూ విజృంభణ

ABN , First Publish Date - 2021-10-30T04:52:24+05:30 IST

మండలంలో డెంగ్యూ విజృంభిస్తోంది. అమీనాబాద్‌ కాలనీలో 45 రోజుల్లో 14 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వైద్యాధికారులు పారి శుధ్యం, యాంటీ లార్వా మందు పిచికారీ చేసిన్పటికీ కేసులు తగ్గుముఖం పట్టట్లేదు.

అమీనాబాద్‌లో డెంగ్యూ విజృంభణ

రాజవొమ్మంగి, అక్టోబరు 29: మండలంలో డెంగ్యూ విజృంభిస్తోంది. అమీనాబాద్‌ కాలనీలో 45 రోజుల్లో 14 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. వైద్యాధికారులు పారి శుధ్యం, యాంటీ లార్వా మందు పిచికారీ చేసిన్పటికీ కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. ఈ కాలనీలో 184 ఇళ్లు, 974 మంది జనాభా వున్నారు. డెంగ్యూ లక్షణాలు, సీజనల్‌ వ్యాధులతో బాధితులు ప్రభుత్వ, ప్రె వేటు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు 68 మందికి పరీక్షలు చేయగా 14 కేసులు వెలుగు చూశాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ అధికంగా ఉంటోందని వైద్యులు చెప్తున్నారు. అమీనాబాద్‌ కాలనీ ప్రజలు జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి ఉంది. కానీ అక్కడ మందులు ఉండట్లేదని ప్రజలు వాపోతున్నారు. దీనిపై జడ్డంగి వైద్యాధికారిణి సుజి మాట్లాడుతూ... ఒక నెలకు సరిపోయే మందులను మూడు నెలలకు పంపుతున్నారని... దీంతో కొరత ఏర్పడిందన్నారు. ఎక్కువగా కానులస్‌, యాంటీ బయాటిక్‌ ఇంజక్షన్ల కొరత ఉందన్నారు. తమ పీహెచ్‌సీ పరిధిలో సుమారు 17వేల జనాభా ఉన్నారని, ఇదివరకు రోజుకు ఓపీ 60 ఉండేదని, ఇప్పుడు 100కు పెరిగిందన్నారు. సిబ్బంది కొరత కూడా ఉందన్నారు.

Updated Date - 2021-10-30T04:52:24+05:30 IST